నటుడు కమల్ హాసన్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఇండియాలోనే వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. 68 ఏండ్ల వయస్సులో కూడా కమల్ కమాల్ చేస్తున్నాడు. దానికి నిదర్శనమే ఇటీవల రిలీజై దుమ్మ దులిపిన ‘విక్రమ్’ సినిమా. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం పేరు ‘ఇండియన్ 2’. ఈ మూవీ కోసం కమల్ హాసన్ శక్తికి మించి వర్క్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేష్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.
భారతీయ సైన్యంలో పనిచేసిన ఒక నిజాయితీపరుడైన అనుభవజ్ఞుడు పాత్రలో కమల్ హాసన్ అలనాడు భారతీయుడుడిలో నట విశ్వరూపం చూపించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా మరలా 26 ఏండ్ల తర్వాత అదే సినిమాకి సీక్వెల్ రానుండటం చాలా ఆనందదాయకం. ఈ సీక్వెల్ ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. రీసెంట్ గా కమల్ హాసన్ డెడికేషన్ ను వివరించే క్రమంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాపై ఆసక్తి పెంచే అంశాలను బయటకు చెప్పింది.
68 ఏండ్ల వయస్సులోనూ కమల్ హాసన్ సినిమా కోసం పరితపించిపోతుండటం చూసి అమ్మడు విస్తుపోయిందట. కాగా ఈ మూవీలోని పాత్ర కోసం స్ట్రిక్ట్ డైట్ మెయింటేన్ చేస్తున్నారని ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ తెలిపింది. ఇండియన్2లో 90 ఏళ్ల వృద్ధుడిగా కమల్ నటిస్తున్న సంగతి విదితమే. దీంతో పాత్రలోకి మారేందుకు ఆహార నియమాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా పాత్ర తాలుకూ ప్రోస్తేటిక్స్ మేకప్ ను వేసుకోవడానికి దాదాపు 5 గంటలు సమయం పడుతుందని తెలుస్తోంది.