సినిమా ఇండస్ట్రీలో స్టార్ పోసిషన్ లోకి వచ్చాక ..ఏ అడుగు వేసిన ఆచితూచి ఆలోచించి వేయాలి . మరీ ముఖ్యంగా బడా హీరోలతో సినిమా లకు కమిట్ అయ్యే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి . స్క్రిప్ట్ లో ఏమాత్రం తేడా వచ్చినా సరే ఇండస్ట్రీలో స్థానం లేకుండా చేసేయగలరు స్టార్ హీరో ఫ్యాన్స్ . అయితే ప్రజెంట్ అలాంటి పొజిషన్ కి చేరుకోబోతున్నాడు కొరటాల శివ అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ చర్చినియాంశంగా మారింది .
మనకు తెలిసిందే ఒకప్పుడు కొరటాల శివ పేరు చెప్తే ఫ్యాన్స్ ఊగిపోయే వాళ్ళు. అప్పటివరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని స్టార్ట్ డైరెక్టర్ గా రాజ్యమేలేశాడు. తీసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే ఒకే ఒక్క సినిమాతో ఆయన ఓవర్ నైట్ ఫ్లాప్ డైరెక్టర్ గా మారిపోయాడు . అప్పటివరకు తీసిన హిట్ సినిమాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ ..ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉన్నాడా లేడా అన్న డౌట్లు కలుగుతున్నాయి.
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసేసాడు. అయితే ఇప్పటివరకు దానికి సంబంధించిన నెక్స్ట్ స్టెప్ వేయలేదు. అసలు ఎన్టీఆర్ తో కొరటాల సినిమా తీస్తున్నాడా..? తీయట్లేదా..? తీయాలని తీయకుండా ఆగిపోతున్నాడా..? అన్న డౌట్లు నందమూరి ఫ్యాన్స్ కు వచ్చేస్తున్నాయి. హీరోయిన్ కోసమే ఇన్ని నెలలు వేచి చూస్తూ ఉంటే ..ఇక స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తి చేసి.. తెరపైకి తీసుకొచ్చి నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఉంచుతాడు అన్న ప్రశ్న హైలెట్గా మారింది. కాగా సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ చర్చించుకుంటున్న ఆధారంగా తారక్ ని కావాలని కొరటాల శివ ఇబ్బంది పడుతున్నాడని.. తారక్ ఎప్పుడో స్క్రిప్ట్ మార్చమని చెప్పిన ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయలేదని ..హీరోయిన్ సాకుతో ఇన్ని నెలలు సినిమాను వాయిదా వేసుకుంటూ వస్తున్నారని తెలుస్తుంది.
అంతేకాదు జనతా గ్యారేజ్ టైంలోనే తారక్ – కొరటాల మధ్య చిన్న కోల్డ్ వార్ జరిగిందట . దాని మనసులో పెట్టుకొని కొరటాల శివ ..ఎన్టీఆర్ సినిమాను లేట్ చేస్తున్నాడని ..ఎన్టీఆర్ టైమ్ ను వేస్ట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చ ఇంట్రెస్టింగ్ గా మారింది .అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఇవంతా ఫేక్ వార్తలు అంటే కొట్టి పడేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇలాంటి ఫేక్ వార్తలు ఇకపై రాకుండా ఉండాలి అంటే కొరటాల నోరు విప్పాల్సిందే.. ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాల్సిందే.. మరి చూద్దాం కొరటాల ఇప్పటికైనా తన మనసు మార్చుకొని ఎన్టీఆర్ తో సినిమాపై అప్డేట్ ఇస్తాడో లేదో..?