ఆఖరికి మెగాస్టార్ కూడా దిగజారిపోయాడా..? మెగాఫ్యాన్స్ ని హర్ట్ చేసిన చిరంజీవి..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సినిమాను తీయడం కాదు ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే మెయిన్ పాయింట్ . సినిమాలు ఈ మధ్యకాలంలో అందరు డైరెక్టర్స్ తీస్తున్నారు . కానీ జనాలకు నచ్చే విధంగా ..జనాలు చేత శభాష్ అని మెప్పించుకునే విధంగా తీయడమే అసలు విషయం. అంతేకాదు వాళ్ళు తీసిన సినిమాని జనాల్లోకి ప్రమోట్ చేయాలి . ఎంత పెద్ద స్టార్ అయినా సరే సినిమాని ప్రమోట్ చేయకపోతే కచ్చితంగా ప్లాప్ అవుతుంది . చరిత్ర ఇదే చెబుతుంది.

కాగా ఇప్పటివరకు మెగాస్టార్ తను నటించిన ఏ సినిమాకి హ్యూజ్ రేంజ్ లో ప్రమోషన్స్ చేయలేదు . ఎందుకంటే ఆయనకు చేయాల్సిన అవసరం లేదు. ఎలాగైనా మెగా ఫాన్స్ హిట్టు కొట్టిస్తారని నమ్మకం ఒకటుంది .కానీ వాల్తేరు వీరయ్య విషయంలో మాత్రం మెగాస్టార్ ఆ రూల్స్ ని బ్రేక్ చేశాడు . తన సినిమాకి హైప్ ఇవ్వడానికి బజ్ క్రియేట్ చేయడానికి ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి తన సినిమాకు సంబంధించిన సాంగ్ ని లీక్ చేసుకున్నాడు .

మనకు తెలిసిందే నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి తన నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుండి సాంగ్ బిట్ ను లిక్ చేసాడు . అయితే ఈ సాంగ్ లీకైన తర్వాత వాల్తేరు వీరయ్యకు ఓ రేంజ్ లో పబ్లిసిటీ దొరుకుతుందని ఊహించుకున్నారు . అయితే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్ డిజాస్టర్ గా మారడంతో శ్రీదేవి పాట సోషల్ మీడియాలో అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది.

ఈ క్రమంలోని మెగాస్టార్ సైతం తన సినిమా ప్రమోషన్స్ కోసం సొంత పాటని ఇలా లీక్ చేసుకున్నాడా..? ఇలాంటి స్థాయికి దిగజారిపోయాడా..? అంటూ మెగా హేటర్స్ అయిన ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వీర సింహారెడ్డి తో కంపేర్ చేస్తే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య దేనికి పనికిరాదు అంటూ కొందరు ఫ్యాన్స్ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహ రాజ రవితేజ కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. ఏది ఏమైనా సరే ఈ సినిమా రిలీజ్ అయ్యి అసలు టాక్ బయటకు వచ్చేవరకు ఈ ఫ్యాన్స్ హంగామా ఎక్కడ ఆగదు . ఈ ఫ్యాన్స్ మధ్య వార్ ఎంత వరకు పోతుందో అంటూ భయపడిపోతున్నారు సినీ ప్రముఖులు..!!