ఎస్ ప్రజెంట్ ఇదే సామెతతో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత ఆయన నుంచి అదిరిపోయే సినిమా వస్తుందని జనాలు అంతా ఎక్స్పెక్ట్ చేశారు . అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు సెకండ్ సినిమా అనౌన్స్ చేసిందే లేదు.
కాగా రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు అంటూ క్లారిటీ వచ్చింది. కాగా ఈ స్టోరీ ఇదివరకే ఎన్టీఆర్ తో తీయాలనుకొని ఆ స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చక ఆగిపోయాడని ..కొన్ని స్క్రిప్ చేంజెస్ చెప్తే ఇప్పటివరకు ఎన్టీఆర్ చెప్పిన విధంగా బుచ్చిబాబు ఆ స్క్రిప్ట్ ను మార్చలేదన్న ఓ రూమర్ వైరల్ గా మారింది. అంతేకాదు ఎటువంటి చేంజెస్ లేకుండానే రాంచరణ్ స్క్రిప్ట్ ను ఓకే చేశాడు అన్న న్యూస్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది .
కాగా ఏదైతేనేం ఉప్పెన తర్వాత మరో స్టార్ తో సినిమా తీయబోతున్నాడు అని ఆశ పెట్టుకునే లోపే ఈ సినిమా కూడా ఆగిపోయినట్లు తెలుస్తుంది. దానికి మెయిన్ రీజన్ మెగాకోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడమే . మనకు తెలిసిందే మెగాస్టార్ కోడలు ఉపాసన గర్భవతిగా ఉంది . పదేళ్లుగా ఎప్పుడెప్పుడు అంటూ మెగా ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రావడంతో రామ్ చరణ్ సినిమాలకుబేక్ పెట్టి మరి తన వైఫ్ ని కేరింగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడట . ఈ క్రమంలోనే బుచ్చిబాబుతో సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే బుచ్చిబాబు టైం ఏం బాగోలేదని స్టార్స్ తో సినిమా అనుకుంటే ఏదో ఒక అడ్డంకులతో ఆయన దురదృష్టం అడ్డుపడుతూనే ఉందని ట్రోల్ చేస్తున్నారు జనాలు.