తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తన కెరీర్ను మొదలుపెట్టింది హీరోయిన్ అమీషా పటేల్. బద్రి సినిమా కంటే ముందే బాలీవుడ్ లో కూడా కొన్నేళ్లపాటు తన అందంతో అభినయంతో కుర్రకారులను ఒక ఊపు ఊపేసింది. ఇదే అందంతో మరిన్ని అవకాశాలను అందుకుంది. అలా బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ రెండు చిత్రాలు ఈమెకు నిరాశనే మిగిల్చాయి.
తెలుగులో చివరిగా బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అమీషా పటేల్ ఏజ్ ప్రస్తుతం 40 ప్లస్ అయినప్పటికీ కూడా.. తన అందం గ్లామర్ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఉంటోంది .సినిమా అవకాశాలు తగ్గినా సరే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారులను అలరిస్తోంది. లేటెస్ట్ గా ఆమిషా పటేల్ సంబంధించి కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇంత ఏజ్ వచ్చినప్పటికీ కూడా తన అందంతో గ్లామర్ తో ఆడియన్స్ ని ఆడేసుకుంటోందని చెప్పవచ్చు.
ముఖ్యంగా బికినీ ఫోటోలతో అందాల బ్లాస్టింగ్ చేస్తోంది అమీషా. సినిమాలలో ఎలా అయినా అవకాశాలు రాలేదు కాబట్టి సోషల్ మీడియాని నమ్ముకుని ఎక్కువగా తన గ్లామర్ను వలకబోస్తోంది. అయితే ఈ రేంజ్ లో అందాలు చూపించడం వెనక ఏం కారణం ఉందో తెలియదు కానీ ఒకప్పుడు మంచి పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇలా కనిపించడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
❤️🔥❤️🔥❤️🔥💋💋💋❤️🔥❤️🔥 pic.twitter.com/hdLszmJBsz
— ameesha patel (@ameesha_patel) December 15, 2022