బిగ్ బాస్ లో బొక్కలు బయటపెట్టిన ఇనయా… సింగర్ రేవంత్ గుట్టు రట్టు?

బిగ్ బాస్ 6 షో దగ్గర పడటంతో తెలుగునాట సర్వత్రా దానిగురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ షోపైన రకరకాల రూమర్స్ బయటకి వస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని బిగ్ బాస్ లోని బొక్కలు ఒక్కొక్కరిగా బయటపెడుతున్నారు. ఈ షో నిర్వాహకులు తమ ప్రణాళికలకు అనుగుణంగా ఆడియన్స్ మైండ్స్ సెట్ చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా ఎలిమినేట్ అయిన ఇనయా కంటెస్టెంట్ రేవంత్ గురించి చెబుతుంటే అతని క్యారెక్టర్ ఇంత దారుణమా అని ప్రేక్షకులు విస్తుపోతున్నారు.

ఇకపోతే సదరు షోలో మొదటి నుండి రేవంత్ ప్రవర్తన వివాదాస్పదంగానే సాగింది. తోటి కంటెస్టెంట్స్ పట్ల చులక భావన చూడటం, ఇంట్లో తన మాటే చెల్లాలనే మొండితనం ప్రదర్శించడం, ఇంకా తన కోసం రూల్స్ బ్రేక్ చేస్తానని అతగాడు చెప్పడం వంటివి ప్రేక్షకులకు మింగుడు పడని విషయాలు. ఇలాంటి విషయాలనే తాజాగా ఇనయా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఇనయా కాస్త ఎక్కువగానే రేవంత్ గురించి స్పందించడం గమనార్హం. రేవంత్ అమ్మాయిలని కూడా చూడకుండా బల ప్రదర్శన చేసేవాడని చెప్పుకొచ్చింది.

అలాగే కోపంలో బూతులు మాట్లాడతాడని, గెలవడం కోసం ఏదైనా చేస్తాడని అంది. కాగా హోస్ట్ నాగార్జున పైన కూడా ఆమె కొన్ని అభియోగాలు మోపింది. నాగార్జున రావడంతోనే రేవంత్ ని ఎత్తే ప్రోగ్రాం పెట్టుకుంటాడు అని, అది అంత మంచిది కాదని చెప్పుకొచ్చింది. కాగా ఈ సీజన్లో నాగార్జున హోస్టింగ్ పరమ వరస్ట్ అని తేల్చి చెప్పేసింది ఇనయా. ఇంకా రేవంత్ బ్యాడ్ బిహేవియర్ పై మండిపడుతూ… ఇన్ని దారుణాలు చేస్తున్నా ఎవరు అడగరు, అంటూ ఆవేదన వ్యక్తం చెందింది.