తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ..మొదటి నుంచి అభిమానులకు ఫేవరెట్ హీరో గానే ఉన్నాడు . దానికి మెయిన్ రీజన్ ఫ్యాన్స్ కోసం ఎలాంటి రోల్స్నైనా ఎలాంటి కష్టమైనా పనిని అయినా సరే చేయడానికి ముందుకు వస్తాడు బాలకృష్ణ అని ఆయన ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు. కాగా ఇప్పటివరకు మనం ఆయన చేసిన సినిమాలన్నీ చూసిన ఈ విషయం మనకు ఇట్టే అర్ధం అయిపోతుంది. కాగా గత ఏడాది అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందజేసిన బాలయ్య ప్రజెంట్ మరో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు .
మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి . ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలోని సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే నేడు ఉదయం సినిమాకి మెయిన్ మాస్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పాట సోషల్ మీడియాలో రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది . అంతేకాదు ఈ పాటకి మెయిన్ హైలైట్ తమన్ ఇచ్చిన మ్యూజికల్ బీట్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సైతం ప్లస్ గా నిలిచింది.
ఇప్పటివరకు చూడని విధంగా బాలయ్యను ఈ పాటలో చూడబోతున్నాం అని రిలీజ్ అయిన రెండు మూడు స్టెప్స్ ఆధారంగా తెలిసిపోతుంది. కాగా పాట లిరికల్ వీడియోనే ఈ రేంజ్ లో ఆకట్టుకుంటుంటే.. ఫుల్ వీడియో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు . కాగా ఈ పాటకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు నందమూరి బాలకృష్ణకు జ్వరం ఎక్కువగా ఉండిందట అయినా సరే రెస్ట్ తీసుకోకుండా చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టకుండా అనుకున్న టైం కి సినిమాను రిలీజ్ చేయాలని వేరే యాక్టర్స్ డిస్టర్బ్ కాకుండా ఇంజక్షన్ చేయించుకొని మరి ఈ పాటకు స్టెప్పులు వేశారట. ఇంజక్షన్ జ్వరం తగ్గడానికి ఇంజక్షన్ వేసుకున్న సరే ఆయన ఫేస్ లో ఆ ఫీలింగ్ కనపడకుండా శృతిహాసన్ కి ఏం మాత్రం తీసిపోని విధంగా ఆడి పాడి అలరించాడు అని చిత్ర బృందం ద్వారా సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సరే ఈ కాలం యంగ్ జనరేషన్లు బాలయ్యను చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . నో డౌట్ ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న నందమూరి ఫ్యాన్స్.