మ‌హేష్ మూవీలో ఐటెం సాంగ్‌కు ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ‌, తండ్రి ఇందిరాదేవి క‌న్నుమూశారు. ఈ నేప‌థ్యంలోనే కొద్ది రోజులు షూటింగ్ ఆపేసిన మేక‌ర్స్‌.. డిసెంబర్ రెండో వారం నుంచి త‌దుప‌రి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు.

ఇక‌పోతే ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండ‌బోతోంద‌ని.. అందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక న‌టించ‌బోతోంద‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ కు ర‌ష్మిక పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది. రూ. 4 కోట్ల రేంజ్ లో ర‌ష్మిక డిమాండ్ చేసింద‌ట‌. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేక‌ర్స్ సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఒకే చెప్పిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా ఒక సినిమాకు పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ను ర‌ష్మిక ఐటెం సాంగ్ ద్వారా ఛార్జ్ చేస్తోంది.

Share post:

Latest