నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి ప్రధాన కారణం ఆ ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు బాలయ్య అల్లుడు లోకేష్ గెస్టులుగా వచ్చారు.
ఈ ఎపిసోడ్ కు మాత్రం ఎవరూ ఊహించని విధంగా పది లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ ఈ తర్వాతి ఎపిసోడ్లకు మాత్రం ఆ స్థాయిలో వ్యూస్ దక్కించుకోలేకపోయాయి. ఇప్పటివరకు ఈ సీజన్లో నాలుగు ఎపిసోడ్లు కంప్లీట్ అవ్వక. ఈ శుక్రవారం ఐదో ఎపిసోడ్ కూడా రాబోతుంది. ఐదో ఎపిసోడ్ గాను ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేందర్రావు, కోదండ రామిరెడ్డి ఈ లెజెండ్రీ పర్సన్స్ నలుగురు ఐదో ఎపిసోడ్ కి అతిథులుగా రాబోతున్నారు.
ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ రాబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఎపిసోడ్ నిజంగా ఉంటుందా లేదా అని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఈ సీజన్లో జరగబోయే ఓ ఎపిసోడ్ కు జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ అతిథులుగా రాబోతున్నారని తెలుస్తుంది. ఈ వార్త గనక నిజమైతేే ఆహాకు పంట పండినట్టే అని చెప్పవచ్చు.
ఈ కాంబోకు సంబంధించి ఆహా టీం కూడా ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ ని కూడా ఆహా టీం సంప్రదించినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ మాత్రం లాస్ట్ ఎపిసోడ్ గా వస్తే మాత్రం నందమూరి అభిమానులకు పండగానే చెప్పవచ్చు. నందమూరి కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయని రూమర్లకు ఆ ఎపిసోడ్ తో కౌంటర్ ఇవ్వొచ్చని బాలయ్య కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ఉందో లేదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.