కేజిఎఫ్ నటుడితో డేటింగ్ లో ఉన్న బాలయ్య హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు మధ్య ప్రేమ వ్యవహారాలు ఏ ఇండస్ట్రీలో నైనా కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ఒక విలన్తో డేటింగ్ లో ఉందని వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. గత కొంతకాలంగా ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వివాహానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా శాండిల్ వుడ్ వర్గాల నుంచి బాగా వినిపిస్తున్నాయి. ఇక వీటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Kannada Actress Haripriya To Tie The Knot With Vasishta Simha In 2023? -  Filmibeatఅసలు విషయంలోకి వెళితే కన్నడలో క్రేజీ హీరోయిన్ గా పేరు పొందిన హరిప్రియ గత కొంతకాలంగా విలన్ పాత్రలో నటిస్తున్న వశిష్ట ఎన్. సింహ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హరిప్రియ తెలుగులో భూమిక భర్త భరత్ ఠాగూర్ నిర్మించిన తకిట తకిట, నాని నటించిన పిల్ల జమిందార్, బాలకృష్ణతో జై సింహా వంటి సినిమాలలో నటించింది. కానీ ఆ తర్వాత తెలుగులో హీరోయిన్గా కంటిన్యూ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం కన్నడలో బిజీ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఒక నటుడు వశిష్ట కూడా కేజిఎఫ్ సినిమాతో విధంగా బాగా గుర్తింపు పొందారు.

కెజియఫ్' నటుడితో హరిప్రియ దుబాయ్ వెళ్లింది అందుకేనా!.. పిక్స్ వైరల్..! -  Filmy Focus

ఆ తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో హెబ్బా పటేల్ నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో నటించారు. ప్రస్తుతం కన్నడలో కూడా పలు చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ హరిప్రియ తో వశిష్ట ఎన్ సింహ కలిసి తిరుగుతూ ఉండడంతో వీరిద్దరిపైన పలు వార్తలు పుట్టుకొస్తున్నాయి ఈ వార్తలను నిజం చేస్తు.. నిన్నటి రోజున బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇద్దరూ కలిసి కనిపించారు. ఇక వశిష్ట ఎన్ సింహ హరిప్రియ తో ఉన్న ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

https://twitter.com/SandalwoodOnlin/status/1597529195823104001?s=20&t=2QGwIs3Ts3xezc4i69E9aA