ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృత్తి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి మాత్రం కెరియర్ బిగినింగ్ లో ఉన్నంత సక్సెస్ రేట్ ప్రస్తుతం మెయింటైన్ చేయలేక పోతుంది. బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుని హిట్ కోసం ఎదురుచూస్తుంది.
ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో నాగచైతన్య నటిస్తున్న కస్టడీ సినిమాలో నటిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా చేయబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈమధ్య కాలంలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులకు తన దగ్గర నుంచి వరుస ఫోటో షూట్లతో మంచి ట్రీట్ ఇస్తుంది.
కెరియర్ బిగినింగ్‌లో గ్లామర్ షోకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సై అంటుంది. ఇక ఈ విషయాలు ఇలా ఉంచితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 2 అనగా రేపు ముద్దుగుమ్మ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో సందడి చేయబోతుంది. ఆ జిల్లాలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న తేజస్వి గ్రాండ్ హోటల్ ప్రారంభించడానికి కృతిశెట్టి అక్కడకు ముఖ్య అతిథిగా రాబోతుంది.
దీనికి సంబంధించిన విషయాన్ని ఈ బ్యూటీ తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కొంత ఫ్రీ టైం దొరకడంతో తన అభిమానులను కలుసుకోవడానికి ఇలాంటి ఈవెంట్లకు ఈ ముద్దుగుమ్మ రెడీ అయినట్టు తెలుస్తుంది.