విజయ్ దేవరకొండ బ్యాంకు ఖాతాలపై.. ఈడీ గందరగోళం..!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీలోకి అడపాదడపా సినిమాలో చేస్తూ తనకంటూ ఎటువంటి గుర్తింపు లేకపోయినా సినిమాలలో నటించే స్థాయికి ఎదిగి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈయన ఇటీవల లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయాన్ని అందించకపోయినా దేశవ్యాప్తంగా అభిమానులను మాత్రం అందించింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అధిక లాభాలను తెచ్చిపెడుతుంది అని అనుకోగా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ ,పూరీ జగన్నాథ్, ఛార్మీ లపై ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ వచ్చాయి. అంతేకాదు ఇటీవల ఈ డి విచారణకు కూడా వీరు హాజరవ్వాల్సి వచ్చింది. అయితే మొన్నటి వరకు లైగర్ సినిమా ఎఫెక్ట్ మొత్తం పూరీ జగన్నాథ్ పైనే పడింది అంటూ మొన్నటి వరకు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ పై కూడా పడబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే లైగర్ సినిమా డిజాస్టర్ గా మిగిలినప్పటికీ నెక్స్ట్ సినిమాతో సత్తా చాటుదామని రిలాక్స్ అయిన విజయ్ దేవరకొండ కి ఈ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ తగిలింది. అదేంటంటే విచారణకు హాజరైన ఈయన పారితోషకం లెక్కల వరకు సేఫ్ అయ్యారు.. కానీ ఈ సినిమా బడ్జెట్ విషయాలపై విజయ్ దేవరకొండ బ్యాంకు ఖాతాలను ఈడి అధికారులు తనిఖీ చేయగా ఎక్కడో తేడా కొడుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే నిజంగానే విజయ్ దేవరకొండ కి లైగర్ పెట్టుబడి తో సంబంధం ఉందా లేదా ఇతర కారణాల వల్ల విజయ్ ను కూడా పిలిపించారన్నది అర్థం కాలేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరియర్ పై పడేలా కనిపిస్తోంది.

Share post:

Latest