నందమూరి హీరోని అవమానించిన చరణ్ వదిన.. మ్యాటర్ బాలయ్య వరకు వెళ్లిందే..!?

నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను రియల్ హీరో అంటుంటారు. మనసులో ఏది దాచుకోవడం ఆయనకు తెలియదు. ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తాడు . అభిమానుల కోసం ఎలాంటి పనిచేయడానికైనా ముందు వరుసలో ఉంటాడు ఈ నందమూరి హీరో. కాగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు . సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

అంతేకాదు అనిల్ రావిపూడి తో సైతం ఓ సినిమా కమిట్ అయ్యాడు నందమూరి బాలకృష్ణ . కాగా ఈ సినిమాలో శ్రీ లీల నందమూరి బాలయ్యకి కూతురుగా నటించబోతుంది . అంతేకాదు నందమూరి బాలయ్యకు హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రే కథను మలపు తిప్పబోతుందని ..అలాంటి పాత్ర కోసం ఓ సాఫ్ట్ నేచర్ కలిగిన హీరోయిన్ కావాలి అంటూ అనిల్ రావిపూడి ..బాలయ్యకు చెప్పిన టైం లో.. బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ స్నేహను ఆ పాత్రకు సజెస్ట్ చేశారట .

కథ విన్న మొదట్లో స్నేహ యాక్సెప్ట్ చేయగా.. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే కొందరు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య అవకాశమిచ్చిన నువ్వు ఉపయోగించుకోలేకపోయావు అంటూ మండి పడుతున్నారు . అంతేకాదు ఇలా మా హీరో సినిమా నుంచి తప్పుకొని ఆయన అవమానిస్తున్నావ్ అంటూ కొందరు ఆమెను ట్రోల్ చేశారు .

ఈ క్రమంలోనే ఆ మేటర్ బాలయ్య వరకు రీచ్ అయినట్లు సోషల్ మీడియా ద్వార తెలుస్తుంది. “సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇలాంటివి కామన్.. ఆమెకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుని ఉండచ్చు..అది ఆమె ఇష్టం ఆడవాళ్లను ఎప్పుడు అసభ్యకరంగా మాట్లాడకూడదు” అంటూ చెప్పకువచ్చారట . ఏది ఏమైనా సరే బాలయ్య మంచితనం మరోసారి బయటపడింది. కాగా వినయ విధేయ రామ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వదిన పాత్రను నటించింది స్నేహ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Share post:

Latest