సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అన్న పదం యమ స్పీడ్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి సెలబ్రిటీని వదలకుండా ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్ .కామన్ మీడియా కావడంతో జనాలు త్వరగా రీచ్ అయ్యే ఫ్యాక్టర్ కావడంతో.. సోషల్ మీడియా లో ఫాస్టుగా స్ప్రెడ్ అయిపోతుంది. కాగా ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే అర్జున్ రెడ్డి సినిమాతో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ..రీసెంట్గా పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా నిరాశపరిచింది.
ఆఫ్ కోర్స్ విజయ్ నటన సూపర్ గా ఉన్నప్పటికీ డైరెక్షన్ పరంగా జనాలను మెప్పించలేకపోయాడు పూరి జగన్నాథ్ . ఈ క్రమంలోని సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది . అంతేకాదు సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆయన కాంబోలో మరో సినిమాని కూడా కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ . పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమనకు విజయ్ దేవరకొండ సైన్ చేసిన విషయం తెలిసిందే . కాగా ఈ సినిమాలో అడిగి ఏరి కోరి మరి పెట్టించుకున్నాడు పూజా హెగ్డే ని. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో జనగణమన కు జైహింద్ చెప్పేసింది.
ఇప్పటివరకు దాని ఊసే లేదు. దీంతో పూజాతో రొమాన్స్ చేయాలన్న కోరిక తీరనే లేదు అంటూ ఫ్యాన్స్ కొందరు ఆయన ని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఎలాగైనా సరే ఖుషీ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ తన పూర్వ వైభవం అందుకోవాలని విజయ్ దేవరకొండ ఆశలు నిరాశగానే మిగిలాయి. మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే . ఆ జబ్బు ఎప్పుడు తగ్గుతుందో..? అమ్మడు ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటుందో..? విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ..? ఇలా అన్నీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయాయి. ఇదే క్రమంలో కొందరు నెటిజన్స్ ఆయన్ను పాత సామెతలతో ఆడేసుకుంటున్నారు . “కట్టుకున్నది పోయే..ఉంచుకున్నది పాయే”.. అంటూ విజయ్ దేవరకొండ ను కావాలనే ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. ఏదిఏమైనా సరే ఒక్క హిట్ కొడితే మళ్ళీ విజయ్ దేవరకొండ ని దేవుడు అంటూ పొగిడేస్తారు ఈ జనాలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే..!!