టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేష్.. గురించి ఎంత చెప్పినా తక్కువే. పైకి చూడడానికి చాలా సైలెంట్ గా మిల్కీ బాయ్ ల ముద్దుగా , క్యూట్ గా ఉంటాడు. మాటలు కూడా వల్గర్ గా ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు . కానీ రీసెంట్గా హిట్ 2 లో నటించిన అడవి శేషు ఆ సినిమా హిట్ అవ్వడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు . అంతేకాదు అడవి శేష్ హిట్ 2 సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి పార్టిసిపేట్ చేసిన అడవి శేషు.. ఫన్ క్రియేట్ చేస్తూ..” మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడుగుతాడు. ఇదే క్రమంలో ఆమె అసలు విషయం చెప్పడానికి మొహమాటపడుతూ ఉంటుంది. అంతేకాదు మాట మాట పెరుగుతూ తూలుతూ అది అడవి శేష్ వైపు టాపిక్ మళ్ళింది . ఈ క్రమంలోని అడవి శేషు మాట్లాడుతూ..ఇంట్రెస్టింగ్ విషయాని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
” నేను పంజా సినిమాలో చేస్తున్న టైంలో ..వెయ్ రా చెయ్ వెయ్ రా ..ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా” అనే సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ నటిస్తున్నప్పుడు ..ఆమె అలా పాడుతుంటే నిజంగానే టెంప్ట్ అయిపోయా అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అడవి శేషు ఇంత రొమాంటిక్ ఫెలోనా..? ఆయన ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతాడా అంటూ జనాలు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రొమాంటిక్ యాంగిల్ లో కూడా చాలా ముద్దొస్తున్నాడు ఈ హీరో అంటూ అడవి శేష్ ని పొగిడేస్తున్నారు జనాలు.