వరుసగా ఐదు ప్లాప్ లు.. అయినా తగ్గేదేలే అంటున్న ఆ ముద్దుగుమ్మ..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తరువాత వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుని హిట్‌ మీద హిట్ కొట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. రామ్ చరణ్- ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఈమె నటించింది. అయితే గ‌త‌ కొంతకాలంగా ఈమే నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అదే క్రమంలో ఆమెకు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి.

బాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్గా మారింది రకుల్. ఈ సంవత్సరం ఏకంగా బాలీవుడ్లో ఐదు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆమె నటించిన ఐదు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయింది. రకుల్ నటించిన సినిమాలు ఏవంటే ‘రన్ వే 34’, ‘కట్ పుటిల్’, ‘ఎటాక్’, ‘డాక్టర్ జి’, ‘థ్యాంక్ గాడ్’ .. ఇలా వరుస పెట్టి రకుల్ నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులు ముందుకు వచ్చిన వీటిలో ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేదు.

ఈ సినిమాలన్నీ ఒకదాని మించి మరొకటి ప్లాఫ్ గా మారిన.. రకుల్ కి వరుస‌ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతులో మరో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఆమె నటిస్తున్న సినిమాలు ఏమిటంటే ‘ఛత్రివాలి’, ‘మేరె పత్ని కా రీమేక్’, తమిళంలో శివకార్తికేయన్ ‘అయలాన్’, ‘ఇండియన్2’ అలానే మరో రెండు సినిమాలలో నటిస్తుంది. రకుల్ మొత్తానికి రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

Share post:

Latest