తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. చిరంజీవి చెప్పే డైలాగులు, డాన్స్ డిఫరెంట్ బాడీ లాంగ్వాజ్ ప్రతి ఒక్కటి కూడా చిరంజీవిని హైలెట్ చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం 66 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా కుర్ర హీరోగా ఇంకా నటిస్తు ఉన్నారు. ఎనర్జీతో పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో తన సినీ కెరియర్ని మొదలుపెట్టిన చిరంజీవి ఎన్నో అవరోధాలను అధికమించి హీరోగా ఎదిగారని చెప్పవచ్చు.
ఇక సినిమాలలో సక్సెస్ కావాలి అంటే ఎవరికైనా సరే ఎవరైనా సరే కష్టపడాల్సిందే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారని చెప్పవచ్చు. ఇకపోతే చిరంజీవి తండ్రి ఒక నటుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఇక చిరంజీవి తండ్రి పేరు వెంకట్రావు గారు. ఈయన ఉద్యోగరీత్యా కానిస్టేబుల్ అయినప్పటికీ.. వృత్తిరీత్యా బాగా పనిచేసేవారు. అయితే డైరెక్టర్ బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు అనే చిత్రంలో నటించారు చిరంజీవి తండ్రి.
అంతేకాకుండా చిరంజీవి సినిమా కెరియర్ మొదలు పెట్టకముందే 1969 లో విడుదలైన జగత్ కిలాడి అనే సినిమాలో చిన్న పాత్ర లో నటించారు వెంకట్రావు గారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని ఆఫర్లు కూడా వచ్చిన కుటుంబ బాధ్యతలు కారణంగా ఉద్యోగరీత్యా బాధ్యతలు పెరగడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారట.
సినిమాలపై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబం కోసం తన ఇష్టాన్ని త్యాగం చేశాడు చిరంజీవి తండ్రి వెంకట్ రావు గారు. ప్రస్తుతం చిరంజీవి తండ్రికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.