రెండో పెళ్లికి నాగ చైత‌న్య గ్రీన్ సిగ్నల్‌.. ఇంత‌కీ అమ్మాయి ఎవ‌రంటే?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంతతో దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన చైతు.. 2017లో గోవా వేదికగా అంగరంగ వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. అనూహ్యంగా విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

పెళ్లి నాలుగేళ్లు గడవక ముందే చైతు-సమంత విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం అటు చైతు ఇటు సమంత ఇద్దరూ కెరీర్‌ పరంగా బాగానే రాణిస్తున్నారు. అయితే తాజాగా చైతూకి సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేంటంటే చైతు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌.

స‌మంత‌తో విడిపోయిన త‌ర్వాత నాగ చైత‌న్య‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌ని నాగార్జున గ‌ట్టిగా పట్టుప‌ట్టార‌ట‌. అయితే తండ్రి కోరిక మేర‌కు తాజాగా చైతు రెండో వివాహం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఓ బ‌డా బిజినెస్ మ్యాన్ కూతురుతో నాగచైతన్య ఏడడుగులు నడవబోతున్నాడని కూడా టాక్ నడుస్తోంది. దీంతో ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Share post:

Latest