జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కంటెస్టెంట్లు కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఎంతోమంది ప్రేమ జంటలు తయారుచేసి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో రష్మీ, సుధీర్.. వర్ష ,ఇమ్మాన్యూయేల్.. రాకింగ్ రాజేష్, సుజాత ఇలా ఎంతో మంది జంటలు చూపించడం జరిగింది.వీరందరి మధ్య కెమిస్ట్రీని ఎప్పుడు హైలైట్ గా చేస్తూ కామెడీని పంచుతూ ఉంటారు. ఇలా అంటివన్నీ మల్లెమాల వారికి మాత్రమే సాటి అని చెప్పవచ్చు. యాంకర్ రష్మీ సుధీర్ జంటకు మంచి క్రేజీ ఉందని ఎన్నోసార్లు వీరి మీద పలు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మల్లెమాల నిర్వాహకులు.
వర్ష, ఇమ్మాన్యూయేల్ మధ్య ఉండే కెమిస్ట్రీ ను కూడా ఎన్నోసార్లు హైలెట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సీన్ రివర్స్ అయ్యిందని చెప్పవచ్చు. ఇమ్మాన్యూయేల్ కి సుధీర్ ఎంట్రీ తోనే రష్మీకి హ్యాండ్ ఇచ్చి మరొకవైపు వర్షా లతో పులిహోర కలపడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు ఇమ్మాన్యూయేల్ గట్టి దెబ్బ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులపాటు జబర్దస్త్ ను వీడిన సుధీర్ తాజాగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీటితోపాటు పలు సినిమాలలో నటిస్తూ పలు టీవీ చానల్స్ లో కూడా ఆఫర్లు వస్తున్న జబర్దస్త్ ను వదిలి వెళ్ళనని తెలియజేస్తున్నారు.
అయితే వచ్చి రావడంతోనే ఇలా రష్మీ, వర్ష తో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు ఈ ప్రోమో కి హైలైట్ గా నిలుస్తున్నాయి. అయితే వర్ష సుధీర్‌ను మన పెళ్లి ఎప్పుడు అని అడగగా.. గాలోడు సినిమా విడుదలైన తర్వాత అంటూ సుధీర్ చెప్పడంతో ఇక ఇప్పుడే కాదంటూ.. వర్ష అనేస్తోంది. ఇక వర్ష సుధీర్ కలిసి పలు రొమాంటిక్ యాంగిల్ లో ఫోజులు ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరిని నవ్వించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.