ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో భారీ చిత్రం “యశోద”.. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా యశోద. ఈ సినిమాను దర్శకులు హరి మరియు హరీష్ లు తెరకెక్కించారు. నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని హిట్ సినిమాగా దూసుకుపోతుంది. తొలి షో తోనే పాజిటివ్ టాక్ రావటంతో మరింత మంది జనం ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇక సమంత విడాకులు తర్వాత మొదటిసారిగా తను ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా అవడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ లు కూడా ట్రేడ్ వర్గాలు ఊహించిన విధంగా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు పోటీగా మరో పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ వారం మొత్తం సమంత యశోద సినిమాదే అని చెప్పవచ్చు. సమంత నుంచి చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా కావటంతో తన అభిమానులు కూడా ఇది మంచి ట్రీట్ లా మారింది. మరి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్ రాబడుతుందో చూడాలి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా.. శ్రీదేవి మూవీస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.