అతి తక్కువ సమయంలోనే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న కన్నడ సోయగం, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. నార్త్‌లోనూ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి చెప్పి వార్తల్లో నిలిచిన రష్మిక.. తాజాగా ఫిట్నెస్ పై ఫిలాసఫీ చెప్పింది. మూడు ఏదైనా వర్కవుట్స్ చేస్తే హాయిగా ఉంటుందని.. మీరు కూడా ట్రై చేయమంటూ రష్మిక ఓపెన్ కామెంట్ చేసింది.
`బాధగా ఉన్న, కోపంగా ఉన్న.. సంతోషంలోనూ, దుఃఖంలోనూ.. ప్రశాంతతలోనూ, ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు.. ఎలా ఉన్నా వర్కవుట్ చేయండి. వర్కవుట్ చేసిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో కదా! ఒకవేళ ఎవరైనా వర్కవుట్ చేయకపోతే ట్రై చేయండి` అంటూ ఇన్‌స్టా స్టోరీలో రష్మిక రాసుకొచ్చింది. దీంతో ఈమె పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.