పలు తమిళ్- మలయాళం సినిమాలు హీరోయిన్గా నటించిన పార్వతి నాయర్.. రీసెంట్గా తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అక్టోబర్లో చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న తన ఇంట్లో సుమారు రూ.9 లక్షల విలువ చేసే రెండు వాచీలు, 1.5 లక్షలు విలువ చేసే ఐఫోన్, రెండు లక్షలు విలువ చేసే లాప్టాప్ చోరీకి గురైందని, తన ఇంట్లో పనిచేసే సుభాష్ పై పార్వతి అనుమానం వ్యక్తం చేసింది. అతనే దొంగతనం చేశాడని తన కంప్లైంట్ లో పేర్కొంది.
ఆమె కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా పార్వతి నాయర్ ఇంట్లో పనిచేసే సుభాష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంటికి వెళ్లి సోదా చేయగా ..అతని విచారించగా దర్యాప్తులో నమ్మలేని సంచలన విషయాలు బయటపడ్డాయి. “పార్వతి ఇంట్లో రాత్రిపూట చాలామంది మగవాళ్ళు వచ్చి వెళ్లే వాళ్ళు ..అది నేను చూశాను. నన్ను బయటికి చెప్పొద్దని నన్ను టార్చర్ పెట్టేది. ఆమె ఇంట్లో దొంగతనం జరగడంతో అది నా మీదకు నెట్టేసి నన్ను మానసికంగా బాధపడుతుంది. గతంలో నన్ను ఆమె ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టింది నా మొహం మీద ఉమ్ము కూడా వేసింది. నన్ను ఈ దొంగతనంలో కావాలనే నన్ను ఇరికిస్తుందని అతను వాపోయాడు”.
దీంతో అతను చెప్పిన విషయాలు ఎంతో సంచలంగా మారాయి. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఇంకాలోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.. దర్యాప్తులో కంప్లైంట్ ఇచ్చిన పార్వతి నాయర్ ని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. పార్వతి ఇంట్లో పని చేసే సుభాష్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా ఈ నటి స్పందించలేదు.