అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..విజయ్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే అప్డేట్..!

తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన సినిమా విక్రమ్. ఈ సినిమా విడుద‌లై కమలహాసన్ కు అదిరిపోయే కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది. ఈ హిట్‌తో కమలహాసన్ తన తరవాత సినిమాలతో కోలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్ తన తర్వాతి సినిమాను దళపతి విజయ్ తో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒక‌టి బయటికి వచ్చింది.

ఆ విషయం ఏమిటంటే ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టార్ గా నటించబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో విలన్ గా హీరో నివిన్ పాలి , కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్లో వార్త వినిపిస్తుంది. ఇక ఈ విషయం గురించి మేకర్స్ ఎలాంటి ప్రకటనలు ఇవ్వనప్పటికీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ స్టార్ట్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ చిత్రం వారసుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Share post:

Latest