అబ్బాబ్బా..ఇప్పుడు నిజమైన దీపావళి అంటే.. మూడు బ్లాస్టింగ్ అప్డేట్స్ రెడీ..అభిమానులకు పండగే..!!

రాబోయే దీపావళి పండగ సందర్భంగా కొన్ని క్రేజీ సినిమాలకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్లు విడుదల కాబోతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోయే క్రేజీ సినిమాల అప్డేట్ల వివరాలు ఒకసారి తెలుసుకుందాం..!!

నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కోసం..జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఇప్పటివరకు ఈ సినిమాను ణ్భ్ఖ్ 107 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని ఈనెల 21న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Has Chiranjeevi started filming for 'Mega 154' in Hyderabad?

తాజా మెగాస్టార్ చిరంజీవి దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో తన154వ‌ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయబోతున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది.

Vijay - Vijay releases first look of 'Varisu' starring Rashmika Mandanna on  his 48th birthday - Telegraph India

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.. ఈ సినిమాని తమిళ్‌లో వరుసు పేరుతో విడుదల చేయబోతున్నారు. తెలుగులో కూడా వారసుడు పేరుతో విడుదల కాబోతుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నారని తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించాడు.