సీతారామం సినిమాకు.. ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?

హీరో దుల్కర్ సల్మాన్ ముంబై ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా కలిసి నటించిన సినిమా సీతారాం. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి అద్భుతమైన క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌- మృణాల ఠాకూర్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా టీజర్- ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుని భారీ కలెక్షన్ తో ఈ సినిమా దూసుకుపోయింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..!!

SITA RAMAM' (DUBBED) REVIEW | 2 September, 2022 – Film Information

1). నైజాం-10.6 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-1.98కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-3.60 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.3 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.30 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.70కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.80 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు- 92లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.23.39 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2.92 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-7.30 కోట్ల రూపాయలు.
12). మిగిలిన వెర్షన్లు-8.28 కోట్ల రూపాయలు.
13). హిందీ వెర్షన్-4.30 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 46.19 కోట్ల రూపాయలు రాబట్టింది.

Decoding The Production Design of Sita Ramam & Its Vintage Frames

సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా 16.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేకింగ్ సాధించాలంటే కచ్చితంగా 17 కోట్ల రూపాయలు రాబట్టాల్సిందే. ఈ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా క్లోసింగ్ కలెక్షన్ చూసుకుంటే 47 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.