బాస్ ఈజ్ బ్యాక్… దుమ్మురేపిన గాడ్ ఫాదర్ ఫస్ట్ డే కలెక్షన్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.. ఈ ఏడాది చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇప్పుడు గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సినిమాతో చిరంజీవి అదిరిపోయే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిరు సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.. ఆ సినిమాలను కూడా పక్కకు నెట్టి అదిరిపోయే సూపర్ హిట్‌ని అందుకుని సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది గాడ్ ఫాదర్.

ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజు తెరకెక్కించాడు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించాడు. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగానే ఓపెనింగ్స్ ను అందుకుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. మొత్తంగా అయితే ఆ గాడ్ ఫాదర్ మొదటి రోజు యావరేజ్ కలెక్షన్లతో అదరగొట్టింది. నైజాంలో సుమారు 3.3 కోట్లు వసూలు చేయగా, సీడెడ్ లో 3.2 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు వెస్ట్ గోదావరి 58 లక్షలు ఈస్ట్ గోదావరి: 1.60 కోట్లు గుంటూరు: 1. కోట్లు కృష్ణ: 72.5 లక్షలు నెల్లూరు: 57 లక్షలు మొత్తం షేర్: 12.98 కోట్లు మొదటిరోజు గాడ్ ఫాదర్ రాబట్టుకుంది.