పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న పట్టుకొమ్మ.. బేబమ్మ పిక్స్ చూస్తే మతి పోతుంది!

ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి అంటే ఎవరో తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. కేవలం ఒక్క సినిమాతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది ఈ బేబమ్మ. ఆ సినిమా తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్లో పాగా వేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అమ్మడు కెరీర్ ఊపందుకుంది. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం కావడం అందరికీ తెలిసినదే.

ఇక ఆ సినిమా తర్వాత ఈ అందాల భామ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ నటించి మరో విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఇక వరుస అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే మొదట వరుసగా హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకి తరువాత సినిమాలు మాత్రం షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం కృతి చేతిలో నాగచైతన్య, సూర్య చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల ఫలితంపైనే కృతి కెరీర్‌ ఆధారపడింది.

కాగా ఈ ముద్దుగుమ్మ తన 19వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రకరకాల ఇబ్బందుల్నీ ఎదుర్కోంటారు. నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ రాలేదని, హీరో నాగచైతన్య చాలా హెల్ప్ చేసాడని, ఆయనతో వర్క్ చేసేటప్పుడు తను ఎంత ప్రశాంతంగా ఉంటారో అర్థం అయిందని తెలిపారు. ఆయనది ఎంతో స్వచ్ఛమైన మనస్సు అని, ఆయన వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కోన్నారు కృతిశెట్టి. కాగా ఈమధ్య ఆమె వేసుకున్న ఓ డ్రెస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అమ్మడు సదరు పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.