ఇంట్రెస్టింగ్: నమ్రత వద్దు వద్దు అంటున్నా మహేశ్ బాబు చేసిన మూవీ ఇదే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..ఎటువంటి గొడవలకు పోకుండా.. తన పని తాను చూసుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ మార్కును క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు తండ్రి కృష్ణ పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీకి వచ్చిన మాట వాస్తవమే అయినా తండ్రి పలుకుబడిన ఉపయోగించుకొని మాత్రం సినిమా స్టోరీలను దక్కించుకోలేదు. తన సొంత టాలెంట్ తో తెలివితేటలతో మంచి మంచి కథలను చూస్ చేసుకొని ఇప్పుడు మన ముందు ఇలాంటి పోజీషన్ లో టాలీవుడ్ టాప్ ఫైవ్ హీరోలు ఒకరిగా ఉన్నారు.

మరి ముఖ్యంగా మహేష్ బాబులో అందరికీ నచ్చే విషయం ..కథల చూసింగ్. ఒక కథను నమ్మి చూస్ చేసుకున్నాడు అంటే అది ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది. ఇప్పటివరకు ఆయన కెరియర్లో ప్రతి కథను ఆయనే చూస్ చేసుకున్నారట . అయితే కచ్చితంగా ఆయన నమ్మిన కథను సినిమాకు సైన్ చేసే ముందు వాళ్ళ భార్య నమ్రతకు చెప్తాడట . నమ్రత సజీషన్స్ కూడా తీసుకుంటారట. అయితే ఎప్పుడు నమ్రత మహేష్ మాటకు నో చెప్పలేదట. కానీ బ్రహ్మోత్సవం సినిమా కథను విన్న తర్వాత మాత్రం మహేష్ బాబును ఒకసారి ఆలోచించుకోమని చెప్పిందట.

అంతేకాదు ఈ కథను రిజెక్ట్ చేస్తేనే బాగుంటుంది అన్న పాయింట్ లోనే ఆమె మహేష్ కు చెప్పిందట. అయినా కానీ మహేష్ బాబు ఫస్ట్ టైం నమ్రత మాటలు కాదని చెప్పి బ్రహ్మోత్సవం సినిమాకు సైన్ చేశాడట. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంతోనే సినిమా కోసం బాగా కష్టపడ్డారట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ దక్కించుకుందో మనకు తెలిసిందే.. 2016 లో రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు ప్రసాద్ వి పోట్లూరి .ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్, సమంత ,ప్రణీత సుభాష్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కానీ సినిమా 10% కూడా జనాలని మెప్పించలేకపోయింది . అంతేకాదు సినిమా థియేటర్స్ కి వెళ్ళిన జనాలు తలనొప్పి అంటూ సగం లోనే వదిలేసి వచ్చేసారంటూ అప్పట్లో మాటలు వినిపించాయి.