it’s Official: సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి సందడి.. పెళ్ళి చేస్తుకోబోతున్న యంగ్ హీరో..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో అంటే 35-40 ఏళ్లు వచ్చినా కాని పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ మేమే అంటూ గర్వంగా చెప్పుకుంటూ తిరిగేవారు హీరోస్ . అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది . త్వరగా లైఫ్ లో సెటిలైపోదాం అన్న ఆలోచనలోనే 30-32 దాటగానే పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు .ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోస్ హీరోయిన్స్ తమ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని.. మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు తెలుగు జనాలు ..కానీ జెర్సి మూవీ లో నటించిన అబ్బాయి అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు . అలాంటి ఓ క్రేజీ రోల్ ని తీసుకొని జనాలు చేత శభాష్ అనిపించుకున్నాడు హరీష్ కళ్యాణ్. అయితే ఈయన తమిళ్ నటుడు . హరీష్ కళ్యాణ్ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించాడు. ఆ పాపులారిటీతో తెలుగులో కూడా సినిమాలో నటించాడు. అంతే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశాడు.

కాగా ప్రజెంట్ సినిమాలతో బిజీగా ఉన్న హరీష్ కళ్యాణ్ తన లైఫ్ కి సంబంధించిన విషయం అభిమానులతో షేర్ చేసుకొని ఫాన్స్ కు కొత్త ఊపునిచ్చాడు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు హరీష్ కళ్యాణ్ . “నర్మదా ఉదయ్ కుమార్ తో నేను ఏడడుగులు వేసి నా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సంతోషపడుతున్నాను . మాకు మీ ఆశీర్వాదం కావాలి” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఇరువురికి ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు . అంతేకాదు ఈ జంట చూడముచ్చటగా ఉందని ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండాలని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . .దీంతో వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.