పోలీసు కేసులో చిక్కుకున్న పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల తల్లి.. విషయం ఏమిటంటే? 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసి, ఓ ముఖ్యమైన పాత్రలో నటించి వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీలని యువత అంతత్వరగా మర్చిపోలేరు. కాగా ఈమె నటిగానే కాదు.. పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో వివాదాలను ఫేస్ చేస్తోంది. తాజాగా శ్రీలీల తల్లిపై పోలీసులు FIR నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, కొంత మంది నటీమణులు తమ అందం, అభినయంతో పాపులర్ అవుతుంటారు. కానీ శ్రీలీల తొలి చిత్రం నుంచే తన గ్లామర్‌తో పాటు పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీలీల తల్లి స్వర్ణలత పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీలీల తల్లి స్వర్ణలత పై కర్ణాటకలోని అడుగుడి పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు అయింది. శ్రీలీల తండ్రి శుభకర్ రావు.. స్వర్ణలతపై పోలీస్ స్టేషన్‌లో కంప్టైంట్ ఇచ్చారు. ఇక శ్రీలీల ఫాదర్, మదర్ గత 20 యేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. వీళ్ల విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో గత అక్టోబర్ 3న బెంగళూరులో కోరమంగళలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా స్వర్ణలత ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు అపార్ట్‌మెంట్ డోర్ లాక్ కూడా పగలగొట్టినట్టు శుభకర్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై ఆయన అక్రమంగా తన ఇంట్లో ప్రవేశించినందున స్థానిక పోలీసు స్టేషన్‌లో కంప్టైంట్ ఇవ్వడంతో పోలీసులు స్వర్ణలత పై FIR నమోదు చేశారు. గతంలో శ్రీలీల తల్లి స్వర్ణలతపై అనేకల్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఒక కంప్లైంట్ నమోదు అయింది. అప్పట్లో ఓ యూనివర్సిటీ వ్యవహారాలకు సంబంధించి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాదు అప్పట్లో శ్రీలీల తండ్రి శుభకర్ రావు శ్రీలీల తనకు పుట్టలేదనే వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే కదా. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు.