చైతూని పరోక్షంగా టార్గెట్ చేసిన సామ్… తోడు లేకపోతే అస్సలు బతకలేడట?

నాగ చైతన్య, సమంత విడిపోయి ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తల ప్రవాహం మాత్రం ఆగడంలేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయం బయటపడటంతో న్యూస్ అవుతున్నారు. ఏ మాయ చేసేవే లో నటించిన వీరు ఇద్దరు అనతికాలంలోనే ప్రేమికులుగా మారారు. దాంతో ఆ ప్రేమకథ పెళ్లి వరకు దారితీసింది. కొన్నాళ్ల వరకు చిలకల్లాగా జీవించిన పిమ్మట ఏమయ్యిందో తెలియదు కానీ, 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు.

ఇక అప్పటినుండి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. వరుస సినిమాలతో ఇద్దరూ దూసుకుపోతున్నారు. ఈ విషయంలో సమంత కాస్త ముందుగానే ఉందని చెప్పుకోవాలి. వరుస సినిమాల విజయంతో అమ్మడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇక చైతన్య మాత్రం వరుస సినిమాల పరాజయంతో కాస్త వెనకపడ్డాడు. ఆ విషయం పక్కన బెడితే, ఈ మధ్య సమంత షేర్ చేసిన వాక్యాలు కొంచెం చైతన్యకి చెందేవిగా ఉంటున్నాయి. తాజాగా ఆమె తన టీ షర్ట్ పై ఉన్న కోట్ కనిపించేలా ఫోటో షేర్ చేశారు.

దానిని ఇక్కడ మీరు ఫొటోలో చూడవచ్చు. ”యు విల్ నెవెర్ వాక్ అలోన్’ అని దానిమీద రాసుంది. అంటే నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని కదా అర్ధం. దీనిని చూసిన అక్కినేని అభిమానులు సామ్ పై కాలుదువ్వుతున్నారు. ఎందుకంటే అది చాలా క్లియర్ గా చైతన్యను ఉద్దేశించి ఉండటం కొసమెరుపు. ఈమధ్య నాగచైతన్య ఓ వర్ధమాన నటితో రిలేషన్ మెంటైన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా సామ్ పోస్ట్ చెయ్యడం ఇపుడు వైరల్ అవుతోంది. సమంత ఉద్దేశ పూర్వకంగానే అలా పోస్ట్ చేసిందని గుసగుసలు వినబడుతున్నాయి.