వారెవ్వ: బంపర్ ఆఫర్ కొట్టేసిన తాగుబోతు రమేష్..ఏకంగా బాలీవుడ్ బడా హీరోతోనే..!!

సినీ ఇండస్ట్రీలో హీరోలకి హీరోయిన్స్ కే కాదు.. కమెడియన్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది . ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో తాగుబోతు రమేష్ కూడా ఒకరు. నిజానికి ఈయనకు మందు తాగే అలవాటు లేదు. కానీ ప్రతి సినిమాలో ఆయన నటించే క్యారెక్టర్ అందుకు తగ్గట్లే ఉంటుంది. కాబట్టి అందరూ ఇతన్ని తాగుబోతు రమేష్ గా మార్చేశారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఈ అబ్బాయి చాలా మంచోడు అనే ట్యాగ్ తాగుబోతు రమేష్ కి వర్తిస్తుంది.

సినీ ఇండస్ట్రీలోకి జగడం అనే సినిమా ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన తాగుబోతు రమేష్ ఆ తర్వాత మహాత్మా, ఈ వయసులో, భీమిలి, అలా మొదలైంది, అప్పలరాజు, కోడిపుంజు.. ఇలా సుమారు 54 చిత్రాలలో నటించి తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. కేవలం సినిమాల్లోనే కాదు సీరియల్ లోనూ తాగుబోతు రమేష్ నటించి మెప్పించాడు . ఆ తర్వాత జబర్దస్త్ అనే బుల్లితెర షోలో కూడా తనదైన స్టైల్ లో స్కిట్స్ వేస్తూ హెల్తీ కామెడీను పండిస్తూ వల్గారిటీకి దూరంగా కామెడీకి దగ్గరగా ఉండే కాన్సెప్ట్ ని తీసుకుంటూ జనాలకు మరింత దగ్గరయ్యాడు .

కాగా రీసెంట్గా సినీవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తాగుబోతు రమేష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో తాగుబోతు రమేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ తెలుగు మీడియా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఆయన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . నీ లైఫ్ ఇంకా ఎదగాలి అంటూ కోరుకుంటున్నారు . అంతేకాదు “కంగ్రాట్స్ బ్రో..మన తెలుగు వాళ్ల పరువు నిలబెట్టు బాలీవుడ్ లో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఇందుకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!!