చచ్చే లోపు అలా ఒక్కసారైన చేయాలి..ఈ హీరోయిన్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!?

మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తీరని కోరిక ఎప్పుడో ఒకసారి నెరవేర్చుకోవాలని వాళ్ళ మనసుకి అనిపిస్తూ ఉంటుంది . అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకి కూడా కోరికలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అవి బయటకి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారనో.. లేక తప్పుగా భావిస్తారనో తెలియదు కానీ, కొందరు హీరోయిన్స్ హీరోలు మాత్రం తమకు ఉన్న కోరికలను అలాగే దాచి పెట్టేసుకుంటారు .

అయితే ఈ హీరోయిన్ మాత్రం తన కోరికను ఏ మాత్రం సిగ్గుపడకుండా మొహమాట పడకుండా పబ్లిక్ గానే చెప్పేసిందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నివేద థామస్ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు చూడటానికి మన పక్కింటి అమ్మాయి లాగే అనిపిస్తుంది. ఇప్పటివరకు నివేద థామస్ తెలుగులో చేసిన అన్ని సినిమాలలో ఆమె నటనకు మంచి మార్కులు వేయించుకుంది. మరీ ముఖ్యంగా “నిన్ను కోరి” సినిమాలో నివేద నటనకు జనాలు ఫిదా అయిపోయారు. ఓవైపు పెళ్లి బంధానికి విలువిస్తున్న భార్యగా మరోవైపు ప్రేమించిన ప్రియుడు లైఫ్ నాశనం చేసుకుంటూ ఉంటే చూడలేకపోయిన ప్రియురాలిగా రెండు క్యారెక్టర్ లోని ఎమోషన్స్ లు పండించి నివేద సూపర్ హిట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.

కాగా నివేద థామస్ కు హీరో ప్రభాస్ అంటే చాలా ఇష్టమట . అఫ్ కోర్స్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే , కానీ నివేద థామస్ కు ప్రభాస్ అంటే చచ్చేంత ఇష్టమట . ఒక్కసారి అయినా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆయనతో ఫైట్ చేయాలని నివేద కోరికట . జనరల్ గా ప్రభాస్ లాంటి హీరోతో ఎవరైనా హీరోయిన్ రొమాన్స్ చేయాలనుకుంటది. కానీ నివేద మాత్రం ఫైటింగ్ సీన్స్ లో నటించాలని కోరుకుంటుంది. అయితే దీని పై జనాలు మాత్రం నవ్వేసుకుంటున్నారు. ఇద్దరు హైట్ లని మ్యాచ్ చేస్తూ ఫన్నీ మీమ్‌స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది .