ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?

సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు..

ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే రవితేజ పై ఒక ఇంట్రెస్టింగ్ చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. రవితేజ హీరోగా మంచి సక్సెస్ అందుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో హీరో సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేయడానికి సిద్ధమైపోయాడు అంటూ.. ఆయన పని అయిపోయింది..అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి.

 

అయితే ప్రధానంగా చూసుకుంటే సీనియర్ హీరోలు యువ హీరోలతో నటించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. వెంకటేష్- నాగార్జున వంటి హీరోలు యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్లు సింగిల్ గా నటిస్తే ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టే ఇలా మల్టి స్టారర్ సినిమాల జోలికి వెళ్తున్నారు. అయితే రవితేజకు ఆ కర్మ పట్టలేదు. సింగిల్ గా బాక్స్ ఆఫిస్ చరిత్ర ను తిరగ రాసిన ఘనత ఈ మాస్ హీరోది. అయితే, మెగాస్టార్ పై ఉన్న గౌరవం కారణంగానే ఈ సినిమా య్స్స్కెప్ట్ చేసాడట. అంతేకాదు ఈ సినిమా తరువాత వేరే సినిమాలో మల్టి స్టారర్ రోల్ ఇచ్చినా నో చెప్పాడట. అయితే కొందరు జనాలు మాత్రం రవితేజ కి ఇన్నాళ్ళకు బల్బ్ వెలిగిందని..సినిమాల పై దృష్టి పెట్టాడని అంటున్నారు.