ఓ మై గాడ్: సమంత కు నాగచైతన్య అంటే అంత కోపమా..? విడాకుల తరువాత తాళిబొట్టును ఏం చేసిందో తెలుసా…?

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుర్లు కొడుకులు తమ వివాహ బంధాన్ని సగంలోనే తెంపుకుంటూ అభిమానులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం డివర్స్. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువైపోయారు . దానికి రీజన్ ఏంటో ఇప్పటికి అర్థం కావట్లేదు. సుమారు గత రెండు సంవత్సరాల నుంచి దాదాపు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు 20 మందికి పైగానే ఉన్నారంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

అయితే అందరికన్నా అభిమానులను బాధపెట్టిన డివోర్స్ మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో అక్కినేని నాగచైతన్యలదే అని చెప్పాలి . వీళ్ళు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తుంది. అయినా కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన న్యూస్లు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉన్నాయి . మరీ ముఖ్యంగా సమంత అక్కినేని ఫ్యామిలీ పై పరోక్షంగా చేసే కామెంట్స్ జనాలకు మింగుడు పడడం లేదు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయిందా అంటూ ఇప్పటికీ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారిని ప్రశ్నిస్తూనే ఉంటారు. అయితే ఇప్పటివరకు వీళ్లు ఎందుకు విడిపోయారు అన్న విషయం పై మాత్రం అటు అక్కినేని ఫ్యామిలీ కానీ ఇటు సమంత ఫ్యామిలీ కానీ అఫీషియల్ ప్రకటన చేయలేదు .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్య అమ్మగారు దగ్గుబాటి ఆడపడుచు . నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాల చేత డివోర్స్ ఇచ్చేసి అమలను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే నాగచైతన్య పుట్టేశారు . దీంతో అక్కినేని నాగచైతన్య పెళ్లి పనుల్లో దగ్గుబాటి ఫ్యామిలీ అప్పర్ హ్యాండ్ గా నిలిచింది .ప్రతి పనిని దగ్గరుండి చూసుకునింది అమ్మ లక్ష్మి. కోడలికి నగలు చీరలు, సారెలు అన్ని దగ్గుబాటి ఫ్యామిలీ వారే పట్టుకొచ్చారు.

ఆ టైంలో ఈ న్యూస్ యమ వైరల్ గా మారింది. అంతే కాదు పెళ్లిరోజు సమంత ధరించిన చీర దగ్గుబాటి లక్ష్మి వాళ్ళ అమ్మ గారిది. అంతేకాదు ఆమె ధరించిన నగలు కూడా దగ్గుబాటి వారివే. పెళ్లి రోజున సమంత మెడలో నాగచైతన్య కట్టిన తాళిబొట్టులో ఒకటి సమంత గారి అమ్మగారు.. మరొకటి నాగచైతన్య వాళ్ళ అమ్మగారు తీసి ఇచ్చింది. ఈ క్రమంలోనే విడాకులు తర్వాత నాగచైతన్యకు సంబంధించిన ఏ గుర్తు తన వద్ద వద్దు అంటూ సమంత కేవలం వాళ్ళ అమ్మగారు ఇచ్చిన తాళిబొట్టును మాత్రమే అమ్మ జ్ఞాపకంగా తన వద్ద ఉంచుకుందట . మిగిలిన వన్ని దగ్గ్య్బాటి ఫ్యామిలీకి రిటర్న్ చేసేసిందట. ఏది ఏమైనా ఆడపిల్ల జీవితంలో ఇలాంటి చేదు సంఘటనలు జరగకూడనవి . సమంత ఇలా చేస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. దీంతో సమంత కు నాగచైతన్య అంటే అంత కోపమా ..?వీళ్ళ మధ్య అంత గొడవ ఏం జరిగింది అంటూ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.