తాజాగా సమంత అమెరికాకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సర్జరీ కోసం కాదు తాను మయోసిటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను అని.. అందుకే అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అంతేకాదు గత శనివారం రోజున ఇన్ స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ వేదికగా.. “తాను మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని త్వరగా అని కోలుకొని వస్తాను” అని వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ సమంత త్వరగా కోలుకోవాలని ఆమెతో తమకున్న అనుబంధాన్ని కూడా వెల్లడిస్తూ వస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించడం జరిగింది. ఈ క్రమంలోనే సమంతను తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు నాగబాబు.
నాగబాబు మాత్రమే కాదు ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని, చిరంజీవి వంటి వారు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ సమంత త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.. చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా..” డియర్ సామ్.. కాలానుగుణంగా మన జీవితాల్లోకి ఎన్నో సవాళ్లు వస్తుంటాయి.. వాటి వల్ల మనలోని శక్తి, సామర్థ్యాలు మనం తెలుసుకోగలుగుతాము. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు.. అతి త్వరలో ఈ సమస్యను నువ్వు అధిగమిస్తావనే నమ్మకం నాకుంది.. నీకు ఆ ధైర్యం , నమ్మకం కలగాలని కోరుకుంటున్నాను. ఆ శక్తి నీకు కలగాలని” చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఇప్పుడు నాగబాబు కూడా తన ట్విట్టర్ ద్వారా.. ” సమంతతో నేను ఏనాడు నేరుగా మాట్లాడక పోయినప్పటికీ.. ఆమె మయో సిటీస్ తో బాధపడుతోందనే వార్త విని నా హృదయం ద్రవించి పోయింది.. నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె త్వరగా కోలుకోవాలని .. మునుపటికంటే దృఢంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఆమెను నేనప్పుడు స్వతంత్ర మహిళగా, చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన ఆశావాద వ్యక్తిగా చూశాను… మయో సిటీస్ నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని.. మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు నాగబాబు..
ఇటీవల కాలంలో గొప్ప నటీమణుల్లో సమంత కూడా ఒకరిని చెప్పిన నాగబాబు.. మరెన్నో గొప్ప పాత్రల్లో ఆమెను ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారని కూడా తెలిపారు. సమంత అభిమానుల ప్రేమ, అభిమానం ఆమెను ఈ సమస్య నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుందని తాను కచ్చితంగా నమ్ముతున్నానని కూడా వెల్లడించారు. సమంత ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022
To Samantha @Samanthaprabhu2 ,
One of the Strongest Human i ever Known. pic.twitter.com/uAT8CDcgEL
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 30, 2022