కాంతారా పై కన్నేసిన మెగా హీరో..రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ డెసీషన్..!!

కాంతారా ఇప్పుడు ఈ పేరు ఎలా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగు నిర్మాతలు ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు . అంతేకాదు కన్నడ నేటివిటికి చాలా దగ్గరగా ఉన్న ఈ సినిమాను కన్నడ ప్రజలు ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు . ఈ క్రమంలోనే మిగతా భాషల జనాలు కూడా కాంతారా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు.

దీంతో ప్రజల వీక్నెస్ క్యాష్ చేసుకున్న నిర్మాతలు కాంతారా సినిమాను పాన్ ఇండియా లెవల్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు . అంతేకాదు తెలుగులో కాంతారా సినిమా రైట్స్ అల్లు అరవింద్ రెండు కోట్లకి కొనుక్కున్నారు. కాగా కాంతారా సినిమా తెలుగులో కూడా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది . అంతేకాదు అన్ స్టాపబుల్ రికార్డ్స్ కొల్లగొడుతూ కలెక్షన్ సాధిస్తుంది.

ఈ క్రమంలోనే కాంతారా సినిమా ఇంత హ్యూజ్ హిట్ అవ్వడానికి కారణం సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టి అంటూ జనాలు చెప్పుకొచ్చారు. అంతే కాదు సినిమాలోని ప్రతి సీన్ చాలా నేచురల్ గా తెరకెక్కించారు అంటూ విమర్శకులు సైతం..ప్రశంసలు తో పొగిడేసారు. అంతేనా రిషబ్ శెట్టి డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలి అంటూ ఆశపడుతున్నారు.

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రిషబ్ శెట్టి డైరెక్షన్ కు ఫిదా అయినట్టు తెలుస్తుంది . అంతేకాదు రిషబ్ శెట్టి కి పరసనల్ గా కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారని.. ఇదే క్రమంలో ఆయన డైరెక్షన్లో నటించాలని చెప్పుకొచ్చాడనే న్యూస్ వైరల్ గా మారింది. దీంతో త్వరలోనే ఆయన డైరెక్షన్లో రాంచరణ్ సినిమా తీయబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ గా మారింది.