తల్లి చేసిన చిన్న తప్పు..మీనా కెరీర్ తలకిందులు..!!

హీరోయిన్ మీనా అందరికీ సుపరిచితురాలే. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతుంది. అంతేకాదు మీనా తెలుగులోను సినిమాలు చేసింది . చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి బడా హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లోను మీనా కెరియర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . అయితే మీనా తన మొదటి ఇన్నింగ్స్ లో కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు చేసిందని ..అది కూడా తల్లి కారణంగా అని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె వాళ్ల అమ్మ కారణంగా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మీనా తల్లి చేసిన తప్పే ఆమె కెరియర్ తలకిందులు అయ్యేలా చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మనకు తెలిసిందే మీనా మల్టీ టాలెంటెడ్ సాఫ్ట్ రోల్స్.. హార్డ్ రోల్స్ ..ఎలాంటి రోల్స్ లో నైనా అవలీలగా నటించగలరు. ఈ క్రమంలోనే ఆమెకు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర ఆఫర్ వచ్చిందట. కానీ మీనా తల్లి నెగటివ్ షేడ్స్ లో నటిస్తే తన కూతురు కెరియర్ ఎక్కడ డౌన్ అయిపోతుందో అని ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట . ఇక ఆ తర్వాత ఈ ఆఫర్ రమ్యకృష్ణ చేసి ఎలాంటి పేరు దక్కించుకుందో మనకు తెలిసిందే.

ఇప్పటికీ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చూస్తే జనాలకు గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఓ పాత్ర డిజైన్ చేశారు డైరెక్టర్ . అంతేకాదు ఈ సినిమానే కాకుండా మంచి మంచి సినిమాలను కూడా మీనా తల్లి తనకు కథ నచ్చలేదని రిజెక్ట్ చేసిందట. ఈ కారణంగా నే మీనా ఫస్ట్ ఇన్నింగ్స్ ఇబ్బందుల్లో పడిందని.. కానీ సెకండ్ ఇన్నింగ్స్ విషయంలో మాత్రం అలాంటి తప్పు చేయదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.