కోర్టు మెట్లు ఎక్కిన మీరాజాస్మిన్.. అతడి మోజులో పడి కన్న వాళ్ళనే..!!

మీరాజాస్మిన్.. తెలుగులో ఎంతో సాఫ్ట్ గా కనిపించి ఎలాంటి వివాదాలు లేకుండా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని రకరకాలుగా గ్లామర్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. అయితే ఆమె మలయాళ ఇండస్ట్రీ ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ సినిమాలతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరాజాస్మిన్ పదేళ్లకు పైగా హీరోయిన్ గా కొనసాగింది. సినిమా కాకుండా ఎక్కువగా వివాదాల్లో తలదూరుస్తూ ఉండేది. వ్యక్తిగత జీవితంలో ప్రేమలు, పెళ్లి వంటి విషయాల్లో ఆమె ఎక్కువసార్లు వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు.

Meera Jasmine breaks the internet with her latest pictures! | Malayalam  Movie News - Times of India

ఎన్నో వివాదాల నడుమ 2014లో ఫిబ్రవరి 12వ తేదీన తిరువనంతపురంలో పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకుంది మీరాజాస్మిన్. దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. అతడు పేరు అనిల్ జాన్సన్. మీరా జాస్మిన్ తో అనిల్ కి.. పెళ్లికి ముందే వేరొక అమ్మాయితో వివాహం కుదుర్చారు. అయితే మీరాజాస్మిన్ తో పెళ్లి సంబంధం రావడంతో అంతకు ముందు కుదుర్చిన పెళ్లిని ఆపేసి మీరాజాస్మిన్ తో అనిల్ పెళ్లికి సిద్ధమయ్యారు..ఆ మధ్య కాలంలో మరింత వివాదాన్ని సృష్టించింది ఈ విషయం. ఈమె వివాహ జీవితం కూడా 2017లో ముగిసిపోయింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఆమె విడాకులు తీసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి కారణమని వార్తలు గుప్పుమన్నాయి. దాంతో కుటుంబ సభ్యులు సైతం ఆమెను ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో వారి పోరు పడలేక ఆ సమయంలో ఆమె విడిగా ఉంటున్నారు. అదే సమయంలో ఆమెకు సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా మీరాజాస్మిన్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉండేవి. దాంతో ఆమె తన ఆస్తులు కావాలని తన సొంత కుటుంబం పైనే కేసు వేసి కోర్టు మెట్లు ఎక్కింది.

నా ఆస్తులు నాకు ఇచ్చేయండి అంటూ కోర్ట్ కి ఎక్కినా మీరా జాస్మిన్
ఈ విషయంపై మీరా కుటుంబం సైతం స్పందించింది.. ఆమె ప్రస్తుతం ఒక వ్యక్తి మోజులో ఉందని అతడి వల్లే ఆమె కెరియర్ పాడయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆమె ప్రాపర్టీ కూడా అతడు నాశనం చేస్తాడనే భయంతోనే ఆ ప్రాపర్టీ ఇవ్వకుండా తమ దగ్గరే పెట్టుకున్నామని కూడా తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.