వరుణ్ తేజ్ హీరోయిన్ కెరీర్‌‌ను నాశనం చేసింది వీళ్లేనా… అసలు కారణం ఏమిటి?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండవ సినిమా ‘కంచె’లో నటించిన హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గుర్తుందా? అంత త్వరగా మర్చిపోవడం కష్టం కదూ. ఆ సినిమాతో ఓవర్ నైట్ మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఎందుకనో తరువాత తరువాత తెలుగులో అంతగా సక్సెస్ అనిపించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాగే అవకాశాలను కూడా అంతగా దక్కించుకోలేకపోయింది. అయితే, ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది.

అవును, కంచె సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత చెప్పుకోదగ్గ హిట్ ఏదన్నా వుంది అంటే రీసెంట్‌గా అఖండ మూవీ. ఆ సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. యాభై ఏళ్ల వయస్సున్న బాలయ్యబాబుతో నటించిన ప్రగ్యా.. తన తండ్రి వయస్సున హీరోలతో నటించడమే తప్పని కొందరు అంటున్నారు. ప్రగ్యా తనకంటే వయసులో పెద్ద హీరోలతో నటించి తన కెరీర్ పాడుచేసుకుందని కొందరు అంటున్నారు. ప్రగ్యాజైస్వాల్ ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకున్నా తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడానికి దర్శకులు కూడా కారణం అని తెలుస్తోంది.

ఇప్పటివరకు ప్రగ్యా నటించిన సినిమాల్లో దర్శకులు ఆమెకు ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ ఇవ్వడమే కారణం అని కూడా కొందరు అంటున్నారు. కంచె దర్శకుడు క్రిష్, అఖండ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్,ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక వంటి సినిమాల్లో దర్శకులు ప్రగ్యాకు సరైన రోల్ ఇవ్వకపోవడం వలన కూడా తన కెరీర్ ముగిసిపోవడానికి కారణం అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.