ఇంట్రెస్టింగ్: టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ కొత్త ఐటెం గర్ల్ ఎవరో తెలుసా..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఓ ముద్దుగుమ్మ పేరు బాగా హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. తాజాగా వచ్చిన సినిమాల్లో ఐటెం సాంగ్ చేసింది. ఆ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ మరి ఎవరో కాదు వారిన హుస్సేన్. ఈ బ్యూటీ బింబిసారా సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఈమె ఆ సినిమాలో గులేబకావళి… అనే ఐటెం సాంగ్ చేసింది. ఆ సాంగ్ కూడా సినిమాకి పెద్ద హిట్ హిట్ అయింది.

Gulebakavali - Lyric Video | Bimbisara | Nandamuri Kalyan Ram | Chirrantan  Bhatt | Vassishta - YouTube

మళ్లీ తాజాగా ఇప్పుడు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మరో ఐటెం సాంగ్ చేసింది. ఈ భామ ఈ సినిమాలో బ్లాస్ట్ బేబీ.. ఐటమ్ సాంగ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా దసరా పండుగ రోజున‌ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Blast Baby - Lyric Video | God Father | Megastar Chiranjeevi | Nayanthara |  Thaman S | Mohan Raja - YouTube

ఈమె చేసినా రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో… వారిన హుస్సేన్ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ఐటెం గర్ల్ గా కనబడుతుంది. ఈ రెండు సినిమాల్లో చేసిన ఐటెం సాంగ్స్ లో తన అందంతో అందరిని కట్టి పడేసింది. అందంతోనే కాకుండా డాన్స్ తో కూడా అందరిని కట్టిపడేసింది. ఈ రెండు సినిమాలు హిట్ ఆవ‌డంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. వారిన హుస్సేన్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.