శంకర్, రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ సమంత… బుంగమూతి పెట్టుకున్న అక్కినేని వారసుడు?

RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బడా డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చరణ్ 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ కియరా అద్వాని నటిస్తుంది. సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు అనే విషయం ఇప్పటికే లీక్ అయింది. అయితే ఈ సినిమాలో కియరా అద్వానికి బదులుగా సమంతని రీప్లేస్ చేస్తున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

అవును, RC 15 సినిమాలో సమంత నటిస్తుందని టాక్. కియరా కోసం అనుకున్న ఆ పాత్రలో ఆమె ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని.. అందుకే ఆమె ప్లేస్ లో సమంతని తీసుకున్నారని టాక్ వినబడుతోంది. అయితే ఈ విషయం తెలిసి అక్కినేని కాంపౌండ్ కాస్త అసహనానికి గురయ్యారట. అక్కినేని ఫ్యామిలీకి దూరమైన తర్వాత సమంత మళ్లీ తిరిగి ఫాం లోకి రావడం అక్కినేని ఫ్యామిలీకి ఇబ్బంది కరంగా ఉంది. అందుకే ఆమెకు ఛాన్స్ వస్తుందని తెలిస్తే చాలు నాగ చైతన్యకు రగిలిపోతుందని టాక్ వినబడుతోంది.

కాగా సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే. దీనితో పాటుగా విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలతో సమంత తన మునుపటి ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఇదే ఊపులో చరణ్ సినిమా ఛాన్స్ కూడా అందుకుంటే మాత్రం ఇక ఆమెకి తిరుగు ఉండదని చెప్పొచ్చు. తెలుగులోనే కాదు హిందీలో కూడా సమంత అదరగొట్టేస్తుంది. ఫ్యామిలీ మెన్ 2 తర్వాత సమంతకి హిందీలో భారీ ఆఫర్లు వస్తున్నాయి. కాగా డైవర్స్ తర్వాత రెచ్చిపోతున్న సమంతని చూసి అక్కినేని కాంపౌండ్ కొద్దిగా అప్సెట్ లోఉన్నారని టాక్.