ఛీ ఛీ నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు..దానికి రెడీ..సాయి పల్లవి కామెంట్స్ వైరల్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంత సైలెంట్ గా ఉన్నా సరే గాసిప్లు పుట్టుకు రావడం సర్వసాధారణం. హీరోయిన్ ముద్దుపెట్టిన గాసిప్ వస్తుంది.. ముద్దు పెట్టకపోయినా గాసిప్ వస్తుంది . ముద్దు పెడితే అమ్మడు స్పీడ్ ఎక్కువ అంటారు.. ముద్దు పెట్టకపోతే అమ్మడు లో మేటర్ లేదా అంటారు. ఏది ఏమైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక మాత్రం కచ్చితంగా గాసిప్ రావాల్సిందే. అలా వస్తేనే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అయినట్లు జనాలు భావిస్తూ ఉంటారు. అయితే పాపం ఇప్పుడు ఇలాంటి రూమర్ కి బలైపోయింది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.


మనకు తెలిసిందే మల్లర్ సినిమాతో తన సినీ కెరియర్ని ప్రారంభించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫిదా సినిమాతో బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకుంది . రెండు కులాలు, రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల భానుమతి అంటూ తనదైన స్టైల్ లో డైలాగులు చెబుతూ మెగా హీరో వరుణ్ ని అల్లాడించింది . అంతేనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాసింది. ఇక తర్వాత సాయి పల్లవి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది . అఫ్ కోర్స్ శర్వానంద్ నటించిన “పడి పడి లేచే మనసు ” డిజాస్టర్ గా మిగిలినా.. ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసి మరోసారి తన నిజాయితీని ప్రూవ్ చేసుకుంది సాయి పల్లవి.

అయితే సాయి పల్లవి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించను అని డైరెక్టర్స్ కి ముందే చెప్పేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి పల్లవిలో రొమాంటిక్ ఫీలింగ్స్ లేవా ..?హార్మోన్స్ ప్రాబ్లమా..? సాయి పల్లవి అందుకు పనికిరాదా ..?అంటూ నానా రకాలుగా ట్రోలర్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఈ బాధలు భరించలేక రీసెంట్గా అటెండ్ అయిన ఇంటర్వ్యుల్లో సాయి పల్లవి నోరు విప్పినట్లు తెలుస్తుంది. సాయి పల్లవి ఇలాంటి కామెంట్స్ పై స్పందిస్తూ..” నేను సినిమా సెలక్షన్స్ కోసం ఎలాంటి కండిషన్స్ పెట్టనని చెప్పుకొచ్చిందట.

పాత్ర నచ్చితే కచ్చితంగా చేస్తానని పాత్ర నచ్చకపోతే మాత్రం చేయనని.. అంతేకానీ నాలో ఏం ప్రాబ్లం లేదు.. నాకేం ప్రాబ్లం లేదు.. అంటూ ఓపెన్ గానే ఆ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది”. దీంతో సాయి పల్లవి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఏంటో తెలియదు కానీ సాయి పల్లవి గార్హి సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమాకి సైన్ చేయలేదు. దీంతో ఆమె ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. సాయి పల్లవి బ్యాక్ టు ఫిలిమ్స్ అయితేనే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.