ఆ కోరికను తీర్చుకోబోతున్న మహేశ్..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు- స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో SSMB28వ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఓషెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వార్త ఏమిటంటే ఈ సినిమాల మహేష్ బాబు సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడట. మహేష్ బాబు క్యారెక్టర్‌ని ఆధ్యాంతం ఆసక్తికరంగా మలుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబుని సాఫ్ట్వేర్ క్యారెక్టర్ లో చూపిస్తూ.. మరోవైపు పవర్ఫుల్ యాక్షన్ రోల్లో త్రివిక్రమ్ అతని క్యారెక్టర్‌ని డిజైన్ చేశారట.

అయితే ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా నుంచిఈ క్రేజీ వార్త బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. గతంలో మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘నేను సినిమాల్లో కి రాకపోతే సాప్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాల‌ని అనుకుంటున్నానని’.. మహేష్ బాబు చెప్పుకొచ్చారట. ఇక ఇప్పుడు తన కోరికను ఈ సినిమా ద్వారా తీర్చుకుంటున్నాడని మ‌హేష్‌ అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ పెడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.