శ్రీలీల తన సినిమాలు అన్నింటికి ..కామన్ గా పెట్టే కండీషన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో శ్రీలీలకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకుని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదేంటో ఇప్పటికి అర్థం కావట్లేదు . ఇప్పటివరకు శ్రీలీల నటించ్చింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా . కానీ అమ్మడి చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి.

ప్రజెంట్ శ్రీలీల మాస్ మహారాజ రవితేజ సినిమా దసరాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కానీ హిట్ అయితే ఇక ఆమెకు తిరుగుండదనే చెప్పాలి. అంతేకాదు ఇప్పటికే అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమాలో కూతురు రోల్ గా మరో సినిమాకు కమిటీ అయ్యి.. రెడీగా క్రేజీ ప్రాజెక్టును చేతిలో పట్టుకొని ఉంది శ్రీ లీల . అంతేకాకుండా త్వరలోనే తెరకెక్కబోతున్న మారుతి-ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా త్రివిక్రమ్-మహేష్ కాంబోలో సెకండ్ హీరోయిన్ గా కూడా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు-రాజమౌళి క్రేజీ ప్రాజెక్టులో కూడా శ్రీలీల భాగం కాబోతున్నట్లు క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అయితే ఇంతటి బడా బడా ప్రాజెక్ట్స్ పట్టేయడానికి మెయిన్ రీజన్.. శ్రీలీల కమిట్మెంట్ అని తెలుస్తుంది. తను సినిమాను ఓకే చేసే ముందే సినిమాకు ను ఎంత తీసుకుంటాను.. ఎన్ని కాల్ షీట్లు ఇస్తాను అన్న దాన్ని పై క్లియర్గా నోట్ చేసుకుంటుందట. అంతేకాదు సినిమా షూటింగ్ కి టైంకి కరెక్ట్ గా అక్కడ ఉంటుందట . ఎవర్ని ఇబ్బంది పెట్టదట. షూటింగ్ సెట్స్ లో తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతుందట. దీనికోసమే అమ్మడుని ప్రత్యేకంగా హీరోస్ వాళ్ళ సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు . అయితే శ్రీ లీల తన అన్ని సినిమాలకి డైరెక్టర్స్ కి పెట్టే కండీషన్ ఒక్కటే అంటూ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. “మొదటే కాల్ షీట్స్ ఎన్ని కావాలో క్లియర్ గా చెప్పండి. సినిమా కమిట్ అయ్యాక ఎక్స్ట్రా కాల్ షీట్స్ కావాలి అంటే కుదరదు. వేరే ప్రాజెక్ట్స్ కి కమిట్ అయి ఉంటే కష్టం” అంటూ క్లియర్ గా చెప్పేస్తుందట. అంతేకాదు..” ఏవైనా లిప్ కిస్ సీన్స్ ఉన్నా కానీ ముందే చెప్పాలట. తనకి ఇష్టమైన హీరోతో అయితే చేస్తాదట.. వేరే హీరో అయితే చేయదట. ఈ ఏజ్ కే అమ్మడు ఇలాంటి కమిట్మెంట్ పెట్టుకోవడం గ్రేట్ అంటున్నారు శ్రీ లీల ఫ్యాన్స్.