సర్థార్ రిలీజ్ డేట్ లాక్.. ఆరు గెటప్స్ లో కార్తీ విధ్వంసం అప్పుడే!

తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తీ.. ఆయన నటించిన డబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఊపిరి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కార్తీ నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగులో ఆశించిన రీతిలో ఆదరణ లెక్కించకపోయినా తమిళనాడు రికార్డ్ బ్రేక్ చేసింది.

`పోనియన్ సెల్వన్` తో మంచి రెస్పాన్స్ అందుకున్న కార్తీ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. హీరో కార్తీగా అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పీఎస్ మిత్ర డైరెక్షన్లో `సర్దార్` సినిమా వస్తుంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న `సర్దార్` సినిమా అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఈ సినిమాలో రాసి కన్నా, రజిష విజయన్, చుంకీ పాండే తదితరులు కీలకపాత్రలను పోషించారు.

రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. టీజర్ లో కార్తీ ఆరు డిఫరెంట్ గెటప్పులు మరియు బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్, వైవిద్యమైన కథపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ నిర్మాణ విలువలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. సర్దార్ సినిమా ఈ దీపావళికి తెలుగు తమిళం థియేటర్లో రిలీజ్ అయి సందడి చేయనున్నది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యిందని.. ఆరు గెటప్స్ తో త్వ‌ర‌లో కార్తీ విధ్వంసం సృష్టించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడలి.

Karthi sporting two different looks in Sardar