ప‌వ‌న్ ట‌ర్న్ ఎలా ఉంటుంది… ఒక్క‌టే టెన్ష‌న్‌గా అక్క‌డ‌…!

మూడు రోజులపాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అయ్యారు. నిజానికి ఆయ‌న విశాఖ‌కు రావ‌డం.. చాలా కాల‌మే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేత‌లు.. `విశాఖ గ‌ర్జ‌న‌` చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివ‌ల్ల ప‌వ‌న్ ఏం చెప్ప‌నున్నార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం మూ డు రాజ‌ధానుల డిమాండ్‌ను ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ విశాఖ‌లో ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం వ‌చ్చింది. మ‌రి.. ఇప్పుడు ప‌వ‌న్ ఏం చెబుతారు? విశాఖ‌ను రాజ‌ధానిగా చేయాల‌ని భావిస్తున్న వైసీపీ వాద‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తారా? లేదా? అనే ది చూడాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా ఉంటాన‌ని.. మాటిచ్చి.. ఆ విధం గానే చేసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌యంలో విశాఖ‌లో ప‌ర్య‌టించ‌డం.. ఆస‌క్తిగా మారింది. ఎందు కంటే.. ఇప్పుడు ఆయ‌న ఏం చెబుతారు? అనేది చూడాలి.

విశాఖ‌లో రాజ‌ధానిని వ‌ద్ద‌ని చెప్ప‌డం సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప్ర‌జ‌లు పైకి ఎలా ఉన్నా.. లోలోన మాత్రం రాజ‌ధాని వ‌స్తే.. త‌ప్పేంట‌నే భావ‌నతో ఉన్నార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇ లాంటి స‌మ‌యంలో ఇక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ స్పందిస్తే.. పార్టీ ప‌రంగా ఇబ్బంది రాదా? అనేది చూడాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రోవైపు.. శ్రీకాకుళం నుంచి విజ‌య‌న‌గ‌రం వ‌ర‌కు పార్టీని బ‌లోపేతం చేయాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఎలా స్పందిస్తారు? ఎలాంటి ట‌ర్న్‌తీసుకుంటారు. ఒక‌ప్పుడు.. కిడ్నీ వ్యాధి గ్ర‌స్థుల పై ప‌వ‌న్ మంచి గ‌ళ‌మే వినిపించారు. దీంతో ఇక్క‌డ కిడ్నీ వ్యాధి బాధితుల‌కు.. ప్ర‌భుత్వం నుంచి ఆద‌ర ణ ల‌భిస్తోంది. అయితే.. ఈ సానుకూల‌త‌ను ప‌వ‌న్ ఓట్ల రూపంలో మ‌లుచుకోలేక పోయార‌నే వాద‌న ఉం ది. మ‌రి ఇప్పుడు రాజ‌కీయ కోణంలో ఎలాంటి అడుగులు వేస్తారు? ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగుతారు? అనేది చూడాల్సి ఉంటుంది.

Share post:

Latest