అక్కినేని అభిమానులకి శాడ్ న్యూస్.. ఊహించని చిక్కుల్లో తండ్రి కొడుకులు..!?

పాపం తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని హీరో నాగచైతన్య పెళ్లి పెటాకులుగా మారింది . కనీసం ప్రేమించుకున్న అన్ని రోజులు కూడా పెళ్లి బంధాన్ని నిలుపుకోలేక పోయారు నాగచైతన్య -సమంత. ఈ విషయం కారణంగా అక్కినేని అభిమానులు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. నాగచైతన్య అలాంటి హీరోయిన్ చేతిలో మోసపోయావా అంటూ జాలి చూపిస్తున్నారు .

ఈ క్రమంలోనే అక్కినేని హీరోలకు వరుసుగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే అక్కినేని అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ బ్రేకప్ చెప్పుకొని సింగల్ గా ఉంటున్నాడు . ఈ క్రమంలోనే అఖిల్ కు వరుస సంబంధాలు చూస్తున్నా.. ఒకటి కూడా ఫిక్స్ అవ్వట్లేదు. ఏదో ఒక కారణంగా అఖిల్ జాతకానికి మ్యాచ్ అవ్వకుండా ఉండడం .. అఖిల్ కి అమ్మాయి నచ్చకపోవడం కారణంగా.. పెళ్లి క్యాన్సిల్ అవుతూనే వచ్చిందట.

ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ సంబంధం ఫిక్స్ అయిందని.. నాగార్జున క్లాస్మేట్ కూతురుతో పెళ్లి కన్ఫామ్ అంటూ వార్తలు వినిపించాయి. దివాళి సందర్భంగా దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేయాలనుకున్నారట . అయితే లాస్ట్ మూమెంట్లో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ ని కూడా నెట్టింట ట్రోల్ చేస్తున్నారు జనాలు .

అంతేనా బిగ్ బాస్ కారణంగా ఎటువంటి రిమార్కులేని నాగార్జున కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు .ఈ కారణంగానే ఈ దివాళి అందరి కుటుంబాల్లో వెలుగుల నింపితే అక్కినేని కుటుంబంలో మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇంట్లో కోడలు మనవళ్లు మనవరాలు లేకుండా నాగార్జున కోట్ల ఆస్తి ఉన్న ఏం చేసుకుంటారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.