రీసెంట్గా జరిగిన టి20 మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే . నిజానికి అసలు ఇండియా ఓడిపోతుందని అంత అనుకున్నారు ..కానీ వన్ మాన్ ఆర్మీల కోహ్లీ ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగానే ఇండియా ఇంతటి ఘన విజయం అందుకుంది అన్న విషయం మనకు తెలిసిందే. కాగా ఈ ఒక్క కారణంతో ఇన్నాళ్లు కోహ్లీ ని ట్రోల్ చేసిన జనాలు అందరూ.. ఇప్పుడు ఆయనని హీరోలా చూస్తున్నారు. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు కోహ్లీ.
మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్ కూడా కోహ్లీని పొగడటం సంచలనంగా మారింది. కాగా ఈ క్రమంలోనే ఆయన భార్య అనుష్క శర్మ ..కోహ్లీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది . మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కోహ్లీ ఇంటి నుంచి బయలుదేరే టైంలో అనుష్క శర్మ కోహ్లీ దగ్గర మాట తీసుకునిందట .. ఇండియా మ్యాచ్ విన్ అయితే నీకు ఇష్టమైన గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటాను అని. ఈ క్రమంలోని కోహ్లీ ఎవరు ఊహించిన విధంగా గ్రౌండ్లో రఫ్పాడించేసి పాకిస్తాన్ క్రికెటర్లకు చమటలు పట్టించాడు .
ఈ మ్యాచ్ చూస్తున్న జనాలు అందరికీ తెలిసిందే ..లాస్ట్ బాల్ వరకు ఇండియా ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు . కానీ లాస్ట్ ఓవర్ లో మాత్రం మాయ చేసి లాస్ట్ బంతుల్లో 6 కొట్టి ఇండియా విజయానికి మూల కారణమయ్యాడు కోహ్లీ . ఈ కారణంగా భర్తకి ఇచ్చిన మాట నిలబెట్టుకునింది అనుష్క శర్మ . ఆయన ఫేవరెట్ రంగు గ్రీన్ కలర్ లెహంగాలో కనిపించి కోహ్లీని సర్ ప్రైజ్ చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనుష్క శర్మని ఇలా ట్రెడిషనల్ గా చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు అంటూ పొగిడేస్తున్నారు. దీంతో అనుష్క శర్మ విరాట్ కోహ్లీ పేర్లు వైరల్ గా మారాయి . అంతేకాదు అనుష్క శర్మ ఫాన్స్ కూడా “ఎన్నాళ్ళు అయ్యింది నిన్ను ఇలా చూసి ..థాంక్స్ కోహ్లీ నీ కారణంగానే అనుష్క ను ఇలా చూస్తున్నామంటూ “పొగిడేస్తున్నారు.