నొప్పి పుడుతున్న అభిమానుల కోసం అలాంటి పని..పూజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

స్టార్స్ కోసం ఫ్యాన్స్ ఏమైన చేస్తారు అని మనకు తెలుసు..కానీ, ఫ్యాన్స్ కోసం స్టార్ సెలబ్రిటీలు కూడా ఇలా చేస్తారా ..? అంటే అవుననే అనాలి. ప్రస్తుతం పూజా హెగ్డే అలాంటి పని చేసి..శభాష్ అని అనిపించుకుంటుంది. మనకు తెలిసిందే పూజా హెగ్డే కాళ్ళకు గాయమైంది . ఈ కారణంగానే ఆమె నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ బ్రేక్ వేసి ..మరి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది .

అయితే పూజ హెగ్డే మాత్రం అభిమానులను సంతోష పరచడానికి కాళ్లు నొప్పి పెడుతున్న సరే దివాళి ఫెస్టివ్ ట్రీట్ అందించింది .ఈ క్రమంలోనే అభిమానుల కోసం హాట్ ఫోటో షూట్ చేసి బిగ్ దివాళి గిఫ్ట్ అందజేసింది. నిన్న దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు . ఈ క్రమంలోని స్టార్స్ అందరూ కూడా తమకు తోచిన విధంగా అభిమానులకు సర్ప్రైజ్ చేస్తూ ,,వాళ్ళ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. దివాలి విషెస్ అందజేశారు. అయితే పూజా హెగ్డే ఆరోగ్యం బాగోలేని కారణంగా ఫోటోషూట్ కి దూరంగా ఉండింది.

కానీ అందరు హీరోయిన్స్ అభిమానులకి సర్ప్రైజ్ ఇస్తున్న క్రమంలో పూజా హెగ్డే తన అభిమానులకి బిగ్ ఫెస్టివ్ ట్రీట్ అందజేసింది .కాలినొప్పి ఉన్న సరే ఆమె అభిమానుల కోసం దివాళి ఫెస్టివ్ అందజేసింది. ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఫెస్టివ్ ఫోటోషూట్ వైరల్ గా మారింది. గ్రీన్ లేహంగాలో.. చాలా స్టైలిష్ లుక్ లో ..సింపుల్ గా.. ఎలిగెంట్గా పూజ హెగ్డే ఫోటోషూట్ సూపర్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా పూజ హెగ్డే ఫస్ట్ టైం కుర్చీలో నుంచి కదలకుండా కూర్చొని ఫోటోషూట్ ఇవ్వడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపించింది. కాళ్ళు అంత నొప్పి పెడుతున్న అభిమానుల కోసం ఫోటోషూట్ చేయడంతో పూజా హెగ్డే నిజంగా గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఆమె కాళ్ల గాయం త్వరగా నయం అవ్వాలని.. త్వరగా కోలుకోను సినిమా షూటింగ్లో పాల్గొనాలని దేవుని ప్రార్థిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.